14-07-2025 04:34:07 PM
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..
వలిగొండ (విజయక్రాంతి): తరగతి గదియే దేశ భవిష్యత్తుకు పునాది అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) అన్నారు. సోమవారం వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే కార్యక్రమాన్ని మానవ హక్కుల పరిరక్షణ, సంక్షేమ అవగాహన సంస్థ వారిచే నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో విలువలను పెంపొందించవలసిన అవసరం ఉందని ప్రతి ఒక్కరి తమ స్వార్ధాన్ని వీడి పక్కవారికి సహాయం చేసే లక్షణాలను పెంపొందించుకోవాలని ఉన్నత విలువలు ఉంటే సమాజంలో ఉన్నత స్థానం లభిస్తుందని అన్నారు.
ఇతరుల హక్కులను ఎవరు కాల రాయవద్దని, పిల్లలు, యువత మంచి మార్గంలో నడవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్రవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు రావడం జరిగిందన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివిన వారు ఉన్నత స్థానాల్లో ఉంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మాధవాచారి ఎంఈఓ సుంకోజు భాస్కర్, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.