14-07-2025 04:36:10 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ పట్టణంలో అనేకమంది నిరుపేదలు ఉన్నప్పటికీ కేవలం 64 మందికి మాత్రమే ఇండ్లు మంజూరు చేయడం వల్ల అర్హులైన చాలామంది పేదలు ఇండ్లు పొందలేకపోయారని ప్రభుత్వం అధికారులు వెంటనే వలిగొండ పట్టణంలో నిరుపేదల కోసం అదనంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి(CPM Mandal Secretary Sirpangi Swamy) డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి(MPDO Jalander Reddy)కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. మండల పరిధిలోని ఇతర గ్రామాల నుంచి వలస వచ్చి నివాసముంటున్న అనేకమంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని ప్రభుత్వం అధికారులు వెంటనే అదనంగా 200 ఇండ్లను వలిగొండ పట్టణానికి కేటాయించాలని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణం చేసుకోవడానికి సిద్ధంగా లేని వారందరినీ గుర్తించి వారి స్థానంలో నిరుపేదలుగా ఉన్న అర్హులకు వాటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, ఐద్వా పట్టణ కార్యదర్శి శీలం ఇందిర, సిపిఎం పట్టణ నాయకులు కొండూరు సత్తయ్య, ధ్యానబోయిన యాదగిరి, షైనీ శోభ, మారగొని యాదమ్మ, మేడిగ శోభ,ఆదిమూలం లలిత, బిభాను బల్వీర్ సింగ్, మారగోని నాగమణి, కుక్కల నరసింహ, ధ్యానబోయిన సమ్మయ్య, చిలకమర్రి అనిత తదితరులు పాల్గొన్నారు.