calender_icon.png 27 October, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసత్య ప్రచారం చేసిన వారిని వదలం

26-09-2024 12:33:48 AM

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 25(విజయక్రాం తి): బీజేపీని అప్రతిష్ఠపాలు చేసేలా ప్రయత్నించిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వెం కటేశ్వర్లు మాట్లాడుతూ.. కొత్తగూడెం బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ప్రచా రం చేశారని విమర్శించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించడమే కాకుండా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని రేవంత్ కామెంట్ చేశారన్నా రు. ఈ అంశంపై నాంపల్లి కోర్టులో తాను కేసు నమోదు చేసినట్లు కాసం వెల్లడించారు. ఈ రోజటి విచారణకు హాజరుకావాలని కోర్టు రేవంత్‌రెడ్డికి గతంలోనే సమన్లు జారీ చేయగా, ముందే నిర్ణయించిన కార్యక్రమా లు ఉన్నాయని చెబుతూ విచారణకు రాలేదన్నారు.

వచ్చే నెల 16న తప్పనిసరిగా రేవంత్ రెడ్డి హాజరుకావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారని కాసం పేర్కొన్నారు. బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గోకుల్ రామారావు, లీగల్ సెల్ నాయకురాలు హంస తదితరులు పాల్గొన్నారు.