ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదాం
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
తాడ్వాయి, ఆగష్టు, 6 (విజయక్రాంతి): జిల్లాలో అన్ని గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల గ్రామంలో గురువారం ఆయన జ్యూట్ బ్యాగులు, స్టీల్ ప్లేట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోనే ఏండ్రి యాల్ గ్రామము ప్రథమంగా ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారిందన్నారు. ఈ గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. జిల్లాలో మరో ఐదు గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చడానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇక్కడి ప్రజలు ఎంతో కష్టపడి తమ గ్రామంలో ప్లాస్టిక్ ఉండకూడదనే లక్ష్యంతో పని చేశారన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు.
ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నేలసారాన్ని దెబ్బ తీయడంతో పాటు నీటి వనరులను కలుషితం చేస్థాయాన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన మొక్కలు నాటి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పామ్ పండ్ ను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులకు జ్యూట్ బ్యాగులు, స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొర్ని నర్సింలు, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ గిరి, డి ఆర్ డి ఎ పి డి దామోదర్,ప్రత్యేక అధికారి రఘునందన్, ఎంపీడీవో భరత్ కుమార్,తహసిల్దార్ శ్వేత,ఎంపీ ఓ సవిత రెడ్డి, ఎంఈఓ రామస్వామి, ఏఈ లు కల్పన, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.






