calender_icon.png 11 May, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి అద్భుతంగా చేసుకుందాం

08-05-2025 12:19:07 AM

కురుమూర్తి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి

చిన్న చింతకుంట మే 7 : కురుమూర్తి దేవస్థానం ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మరింత అద్భుతంగా చేసుకుం టూ ముందుకు సాగుదామని కురుమూర్తి స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ గౌని గోవ ర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం కురుమూర్తి స్వామి దేవస్థానం దగ్గర దిగుడుమెట్లపై రేకుల షెడ్డు ఏర్పాటు కు భూమి పూజ ను గౌని గోవర్ధన్ రెడ్డి చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో 300 ఫీట్స్ రేకుల షెడ్డు ఏర్పాటు, ఈ రేకుల షెడ్డు ఏర్పాటుకు ముందుకు వచ్చిన నారా యణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన  దిండు రాజవర్ధన్ రెడ్డి, హైదరాబాద్ పట్టణానికి చెందిన ముక్కెర మధుసూదన్ లు కలిసి ఈ షెడ్డు నిర్మాణానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

దాతల మరింత మంది ముందుకు వచ్చి సహకారం అందిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దిగుడుమెట్లపై భక్తులకు ఇబ్బందులు తొలగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు భాస్కరాచారి, వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.