08-05-2025 12:20:13 AM
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడగించింది. బుధవారం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదాబాయి ఒక ప్రకటనను విడుదల చేశారు. రూ.వేయి అపరాధ రుసుముతో ఈనెల 8వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
బుధవారంతో గడువు ముగియడంతో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఒక రోజు గడువును పొడిగించారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 65.96 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈనెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు.