calender_icon.png 9 May, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటభూములను కాపాడుకుందాం!

20-04-2025 12:00:00 AM

నేడు సమాజంలో ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ (రోటి, కప్డా, మకాన్) తప్పనిసరి ప్రాథమిక అవసరా లు. అయితే, పెరుగుతున్న జనాభాకు అ నుగుణంగా ఇళ్ల నిర్మాణాలు పెరగాల్సి ఉంటుంది. ఇళ్ల నిర్మాణాలకి అవసరమైన వెంచర్లు అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అవసరమైన స్థలాలు డెల్టా ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ క్రమం లో కొత్తగా ఇండ్లు నిర్మించుకునే ధనికులతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్లు పంటపొలాలపై పడ్డాయి.

వర్షాధారం లేని ప్రాంతాలు, భూముల్లో మార్పులు చేసినా కొంత ఫర్వాలేదు. కానీ, రియల్ ఎస్టేట్ రంగం వల్ల సారవంతమైన పంటభూము లు తమ ఉనికి కోల్పోతున్నాయి. గూడుకోసం చూస్తే కూడు అందించే వ్యవసాయ క్షేత్రాలు తరిగిపోతూ ఆహార ధాన్యాల ది గుబడి రానురాను తగ్గిపోతున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దా నికి కారణం భూమి పరిమాణం పెరగక పోవడం.

దీనికితోడు వాతావరణ మార్పులవల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి నదీ, సముద్ర తీరప్రాంతాలు కోతకు గురై, వేలాది ఎకరాల్లో పంటభూముల విస్తీర్ణం తగ్గిపోతున్నది. ఉత్తర, దక్షిణ ధృవాల్లో వే లాది సంవత్సరాలుగా నీళ్లు మంచురూ పం (ఘనస్థితి)లో ఉంది. ఉష్ణోగ్రతలు భా రీగా పెరుగుతుండటం వల్ల అక్కడి మంచు పర్వతాలు ఎక్కువ మొత్తంలో కరుగుతున్నాయి. పర్యవసానంగా సముద్ర మట్టా లు పెరుగుతున్నాయి.

ఫలితంగా రానున్న 80 నుంచి 100 సంవత్సరాల్లో ధృవాల వద్ద నీటిమట్టం 1 మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సము ద్ర తీరప్రాంతం నుంచి 20 కి.మీ. వరకు ఉన్న పట్టణాలు, నివాస ప్రాంతాలు సము ద్ర ముంపునకు గురయ్యే ప్రమాదముందని రెండు దశాబ్దాలకు పూర్వమే డిపార్ట్ మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్ సంస్థ ‘చార్టర్ ఫర్ నేచర్’ అనే పేరుతో విడుదల చేసిన ప్రచురణలో తెలిపింది.

భవిష్యత్తులో ఆహార కొరత

రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల పంటభూములు తరిగిపోతే, పెరుగుతున్న జనా భాకు సరిపడా ఆహారం భవిష్యత్తులో లభి ంచే అవకాశం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నివాసం కోసం కనీస సౌకర్యాలతో ఇల్లు నిర్మించుకుంటే ఫరవాలేదు. కా నీ, కొందరు తమ ఆర్థిక స్థితిని చూపించుకునేందుకు అవసరానికి మించి పెద్దపెద్ద భవంతులను నిర్మించుకోవడానికి ఎకరాల కొద్ది స్థలాలను ఉపయోగించుకుంటున్నారు.

ఇలా చేయడం వల్ల ఆయా ఇం డ్ల స్థలాలు లభించక చాలామంది పంట పొలాల వైపు చూస్తున్నారు. కొందరు నిరుపేదలు అసలు ఇల్లుకూడా కట్టుకోలే ని స్థితిలో ఫుట్‌పాత్, ఫ్లు ఓవర్ల కింద తలదాచుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం. కనీసం ఇల్లు కూడా నిర్మించుకునే స్థితిలో అయినా లేని వాళ్లు దేశ వ్యాప్తంగా 20 శా తం మంది ఉన్నట్టు పలు సర్వేలద్వారా తె లుస్తోంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు దరఖాస్తు చేయగానే ల్యాండ్ కన్వర్షన్‌కు అనుమతులు ఇవ్వకుండా దరఖాస్తుకు సంబంధించిన భూమి సారవంతమైందా? లేదా? అని విచారణ జరపాలని నిపుణు లు సూచిస్తున్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూమి అని నిర్ధారించుకున్న తర్వాతే వెంచర్లు ఏర్పాటు చేసుకోవడానికి రియల్టర్లకు అనుమతులు ఇవ్వాలి. దీనివల్ల భవి ష్యత్‌లో దేశంలో కరువు రాకుండా నివారించేందుకు వీలుంటుందని పేర్కొంటు న్నారు. అందువల్ల ప్రభుత్వాలు ఈ వైపు గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 

భారీ విస్తీర్ణంలో భవన నిర్మాణాలు చేపట్టి, స్థలాన్ని వృథా చేయకుండా అవసరమైన మేరకే ఇంటి నిర్మాణం కోసం అను మతులు ఇచ్చే విధంగా నిబంధనలు రూ పొందిస్తే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. దీనిద్వారా వ్యవసాయ క్షేత్రాలను కొంతమేర కాపాడ వచ్చనేది ఆలోచన. విచ్చ లవిడిగా పంటపొలాల్లో వెంచర్లు వేసి, లా భార్జనే ధ్యేయంగా రియల్ ఎస్టేట్ రంగం ముందుకెళ్తోంది.

ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఈ మార్కెట్ పరిమా ణం రూ.24 లక్షల కోట్లుగా ఉంది. దీని పరిమాణం 2034 నాటికి 1.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు, అదే విధంగా 2047 నాటికి 5.17 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల కు ఎగబాకుతుందని రియల్టర్ల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ‘బిల్డింగ్ వికసిత్ భారత్ ట్రాన్స్‌ఫర్మేటివ్ రోల్ ఆఫ్ ది రియ ల్ ఎస్టేట్ సెక్టార్ ఇన్ ఇండియా’ అనే నివేదికలో తెలిపింది.

ఈ సంఘం అంచనా ప్రకారం భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రం గం భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. 2034 ఆర్థిక సంవత్సరం నాటికి పటిష్ఠమైన ఆర్థిక వనరుగా రూపొందుతుందనీ అంచనా. 

వేలాదిగా రియల్ ఎస్టేట్ కంపెనీలు

భారీ, మధ్యతరహా, చిన్న సంస్థలతో కలిపి దేశంలో మొత్తం దాదాపు 82 వేల రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నట్టు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తున్నది. జాతీయ స్థాయిలో 21 రాష్ట్రాలు, 230 నగరాల్లోని 13,000 కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రాతినిధ్యం వహిస్తున్నది.

దేశం లో ఉన్నట్టు చెబుతున్న 82 వేల రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒక్కో సంస్థ కనీసం 30 ఎకరాల్లో వెంచర్లు, అపార్ట్‌మెంట్‌లు చేపట్టినా రెండు, మూడేళ్ల వ్యవధిలోనే 24 ల క్షల వ్యవసాయ భూమి తమ ఉనికిని కో ల్పోతుంది. 

ఫలితంగా సాలీనా ఖరీఫ్, రబీ పంట ల్లో సుమారు 9 కోట్ల బస్తాల వరి, గోధుమసహా ఇతర ఆహార పదార్థాల దిగుబడి తగ్గుతుందని అంచనా. అయితే, రియల్ ఎస్టేట్ రంగం ఒక ప్రధాన ఉపాధి సంస్థగా మారి అనేకమందికి ఉపాధి అవకాశాలూ కల్పిస్తోందనేది కాదనలేని నిజం. గత దశా బ్ద కాలంలో ఈ రంగంలో ఉపాధి గణనీయంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

నల్లధనం కలిగిన చాలామంది పలు ప్రాంతాల్లో ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు కొనేసి భవిష్యత్ తరాలకు ఆస్తిగా అందిస్తున్నారు. కానీ, భావి తరాలకు ఆహార పదార్థాల కొ రత ఏర్పడుతుందనే వాస్తవం అటు రియల్టర్లకు, ఇటు సంపన్నులకు తట్టడం లేదు. కోస్తా రాష్ట్రాల్లో వేలాది ఎకరాల వ్యవసా య భూములు చేపల చెరువులుగా మారిపోతున్నాయి. వీటివల్ల పంట ఉత్పత్తి గణ నీయంగా తగ్గే ప్రమాదం ఉంది.

చేపల చెరువుల నిర్మాణానికి, వెంచర్ల ఏర్పాటుకు అనుమతించే విషయంలో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చెయ్యకపోతే, ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన ‘2047  ఆజాదీ కా అమృత్ కాల్ మహోత్సవం’ నాటికి దేశంలో తీవ్ర ఆహార ధాన్యాల కొరత ఏర్పడే  ప్రమాదం ఉంది.

రియల్ ఎస్టేట్ రంగం ఆర్థిక పరిపుష్ఠి ఇస్తున్నంత మాత్రాన దానితో ప్రజల కడుపు నింపలేమన్న విషయాన్ని గుర్తించాలి. పెరుగు తున్న జనాభాకు కావాల్సిన మేరకు తిండి గింజలూ అవసరమనే విషయాన్ని దృష్టి లో పెట్టుకుని అనుమతుల విషయంలో పటిష్టమైన నిబంధనలు రూపొందించాల్సి ఉంది. 

         వ్యాసకర్త సెల్: 9491545699