11-07-2025 05:59:06 PM
ఏపీఎం నరసయ్య
చిలుకూరు: మహిళలకు ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చిలుకూరు మండల ఏపీఎం నరసయ్య, అన్నారు. శుక్రవారం చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా కళాజాత బృందాలతో మహిళలకు ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలను గురించి అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏ,పీ,ఎం, నరసయ్య, మాట్లాడుతూ... మహిళలు సంఘాలలో చేరడం వలన పొందే లాభాలు, ఇన్సూరెన్స్ ద్వారా లోన్ బీమా, ప్రమాద బీమా సౌకర్యాలను మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సంఘాలకు గోదామ్స్, సంఘాలకు బస్సులు, క్యాంటీన్లు, మొబైల్ ఫిష్ మార్కెటింగ్, శ్రీనిధి ద్వారా డైరీ యూనిట్స్ బ్యాక్ యాడ్ పౌల్ట్రీ క్రింద నాటు కోళ్ల పెంపకం మినిట్స్ ఏర్పాటు చేయడం, కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేయడం వంటి ఇతర అన్ని పథకాలపై అవగాహన కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిసిలు, వివో లు, ఓబీలు, వివో ఎస్, సమ భావన సంఘాల సభ్యులు కళాజాత బృందం, మహిళలు పాల్గొనడం జరిగింది.