calender_icon.png 11 July, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధులను సమర్థవంతంగా నిర్వహించాలి

11-07-2025 06:11:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): పోలీస్ శాఖలో పనిచేసే ఉద్యోగులు విధులను సమర్ధవంతంగా నిర్మించుకొని ప్రజలకు చేరువ కావాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్ఎస్సైలను సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, “పోలీసు సేవ అనేది ప్రజల రక్షణకోసం, న్యాయం కోసం. క్రమశిక్షణ, జవాబుదారీ తనంతో కూడిన విధులు నిర్వహించడం వలనే పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పొందవచ్చు” అని పేర్కొన్నారు. ఆర్.ఎస్.ఐలు తమ శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను పంచుకుంటూ, భవిష్యత్తులో జిల్లా పోలీసు యంత్రాంగానికి తమవంతు సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఉపేందర్ రెడ్డి పోలీసులు పాల్గొన్నారు