calender_icon.png 11 July, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలగని వీధి దీపాలు.. పట్టించుకోని అధికారులు

11-07-2025 06:04:11 PM

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొత్తపేట కాలనిలో  కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగకుండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రాత్రి వేళ ఇండ్లలోకి పాములు వస్తున్నాయని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.