calender_icon.png 12 July, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుడి కుటుంబానికి రూ.70 వేలు అందజేత

11-07-2025 06:07:58 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): గుండెపోటుతో అకాల మృత్యు వాతపడ్డ స్నేహితుడి కుటుంబానికి సహచరులు 70 రూపాయలు అందజేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ గ్రామంలో చోటుచేసుకుంది. కేసముద్రం స్టేషన్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 1997-98 టెన్త్ క్లాస్ బ్యాచ్ కు చెందిన గుండా ఆనంద్ 10 రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. నీతో అతని కుటుంబానికి పూర్వ విద్యార్థులు 70 వేల రూపాయల బ్యాంకు డిపాజిట్ పత్రాన్ని ఆనంద్ సతీమణి నర్మదకు అందజేశారు.