26-08-2025 03:52:31 PM
రైతులు క్యూలో ఉండాల్సిన అవసరం లేదు.
కేంద్రం పంపిన యూరియానే రాష్ట్రం పంపిణీ చేస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతపై మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) మంగళవారం నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. యూరియా పంపిణీపై రేపు అన్ని జిల్లాల్లో సమీక్షిస్తామని మంత్రి జూపల్లి సూచించారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రైతులు క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. కేంద్రప్రభుత్వం పంపిన యూరియానే రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) పంపిణీ చేస్తోందని జూపల్లి వెల్లడించారు. నానో యూరియా వాడాలని కేంద్రం చెప్తోందని, నానో యూరియా వాడకంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగలేదని మంత్రి చెప్పారు. యూరియా కొరత ఉందని కేంద్రప్రభుత్వమే చెప్తోందని తెలిపారు. అంతర్జాతీయ యుద్ధాల వల్ల దిగుమతి సమస్య ఉందని కేంద్రం చెస్తోందన్నారు. యూరియా కేటాయింపులో కేంద్ర సహకరించడం లేదని జూపల్లి ఆరోపించారు.