08-10-2025 12:00:00 AM
ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్
కుమ్రం భీం అసిఫాబాద్, అక్టోబర్ 7(విజయక్రాంతి):ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ స్థలా న్ని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రశాం త్ జీవన్ పాటిల్ మంగళవారం పరిశీలించారు. ప్రాణహిత నదిలో నీటి లభ్యత, నీటి ప్రవాహం, ప్రాజెక్టు నిర్మాణ స్థలం. ఇక్కడి భూమి స్థితి గతులను ఆయన పరిశీలించారు. అధికారులు ప్రాజెక్టు నిర్మాణ స్థలం, ఇతర వివరాలను మ్యాప్లో ఆయనకు చూపించి వివరించారు.. ప్రాణహిత ఎగువన వైన్ గంగా, వార్దా నదుల కలయిక, నిర్మాణ స్థలాన్ని చైనాక్యులర్తో పరిశీలించారు.
ప్రాణహిత నది తీరంలో కాసేపు తిరిగి ప్రాజెక్టు నిర్మాణానికి సంబందించి సమగ్ర వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఇరిగేషన్ సిఇ సత్యనారాయణ చంద్ర, తహసీల్దార్ ప్రమోద్ కుమార్, డిఈ వెంకటరమణ, భద్రయ్య, తిరుపతి, భానుమూర్తి, తహసీల్ సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, తాసిల్దార్ లు దిలీప్, దేవేందర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.