06-10-2025 03:14:00 PM
నారాయణఖేడ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఆయన నివాసానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ సంజీవరెడ్డి వెళ్లి దసరా పండుగ శుభాకాంక్షలను సోమవారం ఉదయం తెలిపారు. ఆయన వెంట ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి సీఎంకు దసరా శుభాకాంక్షలు తెలిపి షాలువతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.