06-10-2025 02:58:04 PM
చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని జనగామ సిద్దిపేట జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న శ్రీరామ్ నగర్ కాలనీ మొండి చింత కాలనీ ప్రజలు రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా సిపిఎం చేర్యాల మండల కార్యదర్శి బండకింది అరుణ్ మాట్లాడుతూ ఈ కాలనీలో దాదాపు 80 ఇండ్లు ఉన్నాయని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ స్కూల్స్ ఉన్నాయని పిల్లలకు స్కూల్స్ గానీ వృద్ధులు వికలాంగులు రోడ్డు ప్రయాణాలలో గాని కాలనీ ఎదురుగా నిలబడితే బస్సులు ఆపక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ అన్నారు.
కాలనీలు ఊరికి చివరన ఉండటం కొత్త బస్టాండ్ కు కాలనీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల పగలు రాత్రి సమయంలో బస్సులు ఆపకపోవడం వల్ల నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని అందుకు తక్షణమే శ్రీరామ్ నగర్ కాలనీ మొండిచింత కాలనీల ఎదురుగా రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని అన్నాడు.ఈ కార్యక్రమంలో సిపిఎం చేర్యాల మండల కార్యదర్శి బండ కింది అరుణ్ సిపిఎం నాయకులు బోయినీ మల్లేశం దండబోయిన భాస్కర్ కాలనీలకు చెందిన ప్రజలు చందర్ చింతల బిక్షపతి పొన్నం పరమేశ్వర్ దీకొండ లచ్చవ్వ వెంకటలక్ష్మి తుమ్మలపల్లి అనిల్ వృద్ధులు,వికలాంగులు తదితరులు ఉన్నారు.