06-10-2025 03:33:49 PM
దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ ఆర్టీసీ డిపో(Devarakonda RTC Depot) 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని సోమవారం 90వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సోమవారం డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు(Devarakonda RTC Depot Manager Thallada Ramesh Babu) ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. దేవరకొండ ఆర్టీసీ డిపో 1936 అక్టోబర్ 6న నిజాం స్టేట్ సర్కార్(Nizam State Government) ఉన్నప్పుడు ఏర్పడిన రెండవ డిపో అని అన్నారు. అప్పటినుంచి దేవరకొండ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ సోమవారం 90వ వసంతంలోకి అడుగుపెట్టడం సంతోషకరమని అన్నారు. ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది సమిష్టి కృషితో దేవరకొండ డిపో ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తూ రీజియన్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించినట్లు గుర్తు చేశారు.