గ్రామాలలో ‘మద్యం’ పంచాయతీ
- పొద్దున ఒకరు రాత్రికి మరొకరు
మద్యంతో మచ్చిక చేసుకుంటున్న ఆశావాహులు
మహిళలకు కల్లు, కూల్ డ్రింక్స్
మధ్యాహానికి బానిస అవుతున్న యువత
స్థానిక పోరులో ఏరులైపారుతున్న మద్యం
సిద్ధిపేట, నవంబర్ 28 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల వేళ సిద్ధిపేట జిల్లా గ్రామాలు అభివృద్ధి, సమస్యలు, వాగ్దానాలపై కాకుండా మద్యం పంచాయతీ నడు స్తున్నాయంటే ఆశ్చర్యం కలగాల్సిందే. సర్పం చ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పొద్దున ఒకరు& రాత్రికి మరొకరు అంటూ మద్యం విందులు ఏర్పాటు చేయడం గ్రామాల్లో పెద్ద చర్చగా మారింది.
యువత లక్ష్యంగా ఉదయం లేస్తూనే స్వాగతం మద్యం!
ఆకాంక్షలు ఉన్న అభ్యర్థులు తెల్లవారుజామునే యువకుల ఇళ్ల ముందు నిలబడి సక ల మర్యాదలతో మద్యం అందిస్తూ వారిని మత్తులోకి నెడుతున్నారు. ఓటు కోసం మ ద్యం& నాయకత్వానికి ఇదే ప్రమాణమా? అని పెద్దలు పలువురు ప్రశ్నిస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా 508 గ్రామపంచాయతీలు ఉండ గా, దాదాపు ప్రతి గ్రామంలో కుల, మహిళ, యువజన సంఘాలను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు హద్దులు దాటుతున్నా రు. యువకులకు మద్యం, వృద్ధులకు కల్లు, మహిళలకు కూల్డ్రింక్స్, కొన్నిచోట్ల కల్లు పంపిణీ చేస్తూ ఓటు కోసం ఏదైనా అన్నట్టుగా పర్యటన సాగుతోంది.
మద్యం మత్తులో మాటల యుద్ధం!
యువతను టార్గెట్ చేసిన పోటీదారుల కారణంగా, గ్రామాల్లో ఇప్పుడు అభ్యర్థులకో సం మద్యం మత్తులోనే పంచాయతీలు జరుగుతున్నాయి. మనోడే గెలుస్తాడు కాదు.. మానోడే గెలుస్తాడు అంటూ మాటల యు ద్ధం మొదలై, కొన్ని చోట్ల గొడవలకు దారితీస్తోందనీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతు న్నారు. నామినేషన్ల దశలోనే ఇంతైతే& ఓటింగ్ రోజున ఏం జరుగుతుందో దేవుడికే తెలుసు అంటున్నారు.
ఉదయం కల్లు, సాయంత్రం మందు
కొన్ని గ్రామాల్లో ఒక అభ్యర్థి తెల్లవారుజామున కల్లు ఏర్పాటు చేస్తే, మరొక అభ్యర్థి సాయంత్రం మద్యం విందు పెడుతున్నారు. రోజంతా కూలిపనికి వెళ్లిన మహిళల ఇళ్లకు కూడా రాత్రి కల్లు, కూల్డ్రింక్స్ పంపిస్తూ ఇవి మా అభ్యర్థి పంపించినవి అనే ప్రచారం ముమ్మరం చేస్తుంటారు.
కుల తీర్మానాల్లో పోటీ
కుల సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి తీర్మానాలు తీసుకుంటూ, మద్ద తు కోసం అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితు ల్లో నిజమైన ప్రచారం, నిజమైన సమస్యలు ఎక్కడో మరుగున పడిపోతున్నాయి.
కనిపించని అవగాహన ప్రచారం పోలీసులు ఎక్కడ?
ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్లకు అవగాహన కల్పించాలి. అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లోకి వెళ్లి స్వేచ్ఛా ఓటు గురించి చైతన్యం కల్పించాలి. కానీ ఇప్పటికీ అలాంటి ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు. పోలీసులు ప్రత్యేక బృం దాలుగా గ్రామాల్లోకి వెళ్లి మద్యం ప్రవాహాన్ని కట్టడి చేయకపోతే యువత పెడదారి నపడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మద్యం ఆధారిత ప్రచారం ప్రజాస్వామ్యానికి మచ్చ సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం మాట్లాడాల్సిన చోటమ ద్యం, కల్లు, కూల్ డ్రింక్స్ తో ఓట్ల వేట సాగడం గ్రామీణ రాజకీయాల దురదృష్టకర దృశ్యమే అంటున్నారు పెద్దలు. ప్రజా స్వామ్యాన్ని మద్యం మత్తులో ముంచే వారికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలన్న ప్రచారం సాగుతుంది.




