calender_icon.png 29 November, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు దశాబ్దాలుగా అన్యాయమే!

29-11-2025 01:19:06 AM

-కాంగ్రెస్ మభ్యపెట్టి వెన్నుపోటు పొడిచింది

-రాజ్యాంగ సవరణను కాంగ్రెస్ అప్పుడే ఎందుకు చేయలేదు

-బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): బీసీలకు దశాబ్దాలుగా అన్యాయమే జరుగుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మ ణ్ తెలిపారు. రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు 50 శాతం సీలింగ్‌ను విధించిందని, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మహా త్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం బీజేపీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి బీసీల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారన్నారు. గ్రామాలకు వెళ్లి బీసీలకు చేస్తున్న మోసం, దగా గురించి వివరించాలని ఆయ న పిలుపునిచ్చారు. కులగణన, సర్వేలు, నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఆర్డినెన్సులు, జీవోలు జారీ... ఇలా వెనుకబడిన వర్గాలను మభ్యపెట్టి, చివరికి బీసీలకు వెన్నుపోటు పొడిచారని, అశాస్త్రీయ డేటాతో కోర్టుల్లో కూడా అభాసుపాలయ్యారని విమర్శించారు.

  నెహ్రూ కుటుంబం నుంచి రాహుల్ కుటుంబం వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు. బీసీలకు 42 శాతం మంత్రి పదవులు ఇవ్వడా నికైనా, బీసీ సబ్-ప్లాన్‌కు చట్టబద్ధత ఇవ్వడానికైనా ఎక్కడ కోర్టు అడ్డుపడిందో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీయే అని, చేయలగిందే చెబుతామన్నారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, బి జయశ్రీ, రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారి, వేముల అశోక్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ , బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితర నాయకులు పాల్గొన్నారు.