25-07-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూలై 24: సురక్షిత నగరాల జాబితాలో మన భాగ్యనగరానికి ఆరో స్థా నం దక్కింది. సంబియో క్రైం ఇండెక్స్- 20 25 పేర వెలువడ్డ నివేదిక భారతదే శంలోని సురక్షిత నగరాల జాబితాను వెల్ల డించింది. ఈ జాబితాలో హైదరాబాద్‌కు ఆరో స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 279 నగరాలకు సంబంధించి వెలువడ్డ ఈ నివేదికలో అబుదాబీ మొదటి స్థానంలో నిలిచింది.
అబుదాబీ భద్రతా సూచిక స్కోరు 88.4గా ఉండగా.. రెండో స్థానంలో దోహా ఖత్తార్, మూడో స్థానంలో దుబాయ్, నాలుగులో షార్జా నగ రాలు చోటు దక్కించుకున్నాయి. భారత దేశం విషయానికి వస్తే 68.6 పాయింట్లతో అహ్మదాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచజాబితాలో అహ్మదాబాద్ 77వ స్థా నాన్ని కైవసం చేసు కోవడం గమనార్హం.
రెండో స్థానంలో జైపూర్ (65.2), తర్వాతి స్థానా ల్లో వరుసగా కోయంబత్తూర్ (62), చెన్నై (60.03), పుణె (58.7), ఆరో స్థానంలో హై దరాబాద్ (57.3) నిలవగా.. మన హైదరా బాద్ తర్వాతి స్థానంలో ముంబై (55.9), కోల్‌కతా (53.3 ), గురుగ్రామ్ (46), బెంగ ళూరు (45.7), నోయిడా (44.9), ఢిల్లీ (41) భద్రతా స్కోర్లు సాధించాయి.
వివిధ నగరా ల్లో జరిగే నేరాల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేశారు. రాత్రి వేళలు, పగటి వేళలో జరిగే నేరాలు, విధ్వంసాలు, దొంగతనాలు, హత్యలను పరి గణలోనికి తీసుకుని ఈ నివేదికను సిద్ధం చేసినట్టు సంబియో ఇండె క్స్ ప్రతినిధులు తెలిపారు.