25-07-2025 12:00:00 AM
నటుడు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై అసంతృప్తి
న్యూఢిల్లీ, జూలై 24: రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మం జూరు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయాధికారం దుర్వినియోగమైందని వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన తప్పును తాము పునరావృతం చేయబోమ ని తెలిపింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జేబీ పార్థివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడి న ధర్మాసనం కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి, తీర్పును వా యిదా వేసింది.
‘ట్రయల్ కోర్టు లేదా సెషన్స్ కోర్టు ఇలాంటి పొరపాటు చేసిందంటే దాని ని పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ ఒక హైకోర్టు న్యాయమూర్తి అలా చేయడం ఆ మోదయోగ్యమైంది కాదు. హైకోర్టు తన వి చక్షణాధికారం ఉపయోగించిన తీరుతో మేం ఏకీభవించలేకపోతున్నాం. బెయిల్ ర ద్దు చే యాలని వాళ్లు కోరుతున్నారు. మీ క్లయింట్ బెయిల్‌పై ఉన్నందున మీ వాదన వింటాం.
హైకోర్టు ఇచ్చిన తీర్పును మీరు చూసే ఉ ంటారు. హైకోర్టు తప్పును మేము పునరావృతం చేయము. హత్య, కుట్ర కేసు కా వడంతో సీరియస్‌గా పరిశీలించాల్సిన అవసరముంది. అప్పటివరకు తీర్పును వా యి దా వేస్తున్నాం’ అని దర్శన్ తరఫు న్యా యవది కపిల్ సిబల్‌ను ఉద్దేశిస్తూ గవాయ్ వ్యా ఖ్యానించారు. దర్శన్ అభిమాని రేణుకాస్వా మి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.