25-07-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూలై 24: 2006 నాటి ముం బై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు.. కేసులో నిందితులుగా ఉన్న ఆ 12 మంది ని ర్దోషులని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు ఆదేశాలతో విడుదలైన ఖైదీలను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
2006 జూలై 11న ముంబై పశ్చిమ రైల్వే లైన్‌లోని పలు సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ మారణహోమంలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. 2015 అక్టోబర్‌లో 12 మంది నిందితులను దోషులుగా పేర్కొం టూ ఐదుగురికి ఉరిశిక్ష, ఏడగురికి జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.