17 April, 2026 | 11:16 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రోడ్ల పైనే పశువులు.. ప్రమాదాలకు నెలవులు

14-06-2025 12:21 AM

చర్ల, జూన్ 13 (విజయక్రాంతి):మండలంలో విచ్చలవిడిగా పశువులు రోడ్లపై దర్శనమిస్తున్నాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి, చర్ల మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ ,అంబేద్కర్ సెంటర్, పాత చర్ల ప్రధాన రహదారులపై పశువులు వీరంగం చేస్తూ ఉ న్నాయి, మండలంలోని ఆర్.కొత్తగూడెం గ్రామంలో పశువులు రాత్రింబవళ్లు రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు నెలవుగా తయారయ్యాయి .

ప్రధాన రహదారి పొడవునా తిరుగుతూ ప్రమాదాలకు గురౌవుతున్నాయి. మండలంలో రాత్రిపూట ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది,పశువులను ఢీకొని ప్రమాదాలకు గురైన వారు కూడా లేకపోలేదు ,రో డ్లపై పశువులు పోట్లాడుకుంటూ ఇండ్ల ముందు పెట్టుకున్న ద్విచక్ర వాహనాలు, కార్ల మీద పడి ధ్వంసం చేస్తున్నాయి. ప్రధాన రహదారిపై ఉండడంతో వాహన సాధకులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి .

ఎప్పుడు ఎటు నుండి ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహన సోధకులు భ యభ్రాంతులకు గురౌవుతున్నారు. పశువుల యజమానులు పశువులను జాగ్రత్త పరుచుకోకుం డా నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలేయటం పట్ల గ్రామస్తులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించి పశువులను రోడ్లపై ఉండకుండా యజమానులకు తెలియపరచాలని, లేనియెడల పశువులను బద్దెల దొడ్లకు తరలించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.