25-10-2025 07:52:38 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆవులు, గేదెలు, ఎడ్లలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు పశుపోషకులు తప్పకుండా తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మావలలో శనివారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పశువైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పశువులకు వ్యాధి నివారణకు టీకాలు వేశారు. 7వ విడత టీకాల శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.
పశుసంవర్ధక శాఖ తరపున ఇచ్చే ఈ గాలికుంటు వ్యాధి నివారణ ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చిన యెడల పశువులకు కాలీ డెక్కలకు పుండ్లు ఏర్పడడం నోటిలో పుండ్లు రావడం వలన ఏమి తినలేక నిరసించిపోతాయని తెలిపారు. పాడిపశువులు పాలు ఇవ్వకపోవడం, సూడి పశువులు అబార్షన్ కావడం వలన రైతులు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుందన్నారు. కావున ప్రభుత్వం ఇచ్చే ఈ టీకాలను తప్పకుండా అన్ని పశువులకు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 14 వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో పశువైద్య అధికారి డాక్టర్ దూద్ రామ్ రాథోడ్, రైతులు దినేశ్, ప్రశాంత్, సాగర్, సిబ్బంది సాయి ప్రసాద్, పోచన్న, గోపాల మిత్రుడు రమేష్, ఉన్నారు.