06-08-2024 03:36:20 PM
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ ప్రధాని ఎల్ కే అద్వానీ మంగళవారం చికిత్స నిమిత్తం ఢిల్లీలోని అపోల్లో హాస్పిటల్ లో చేరారు. 96 ఏళ్ల అద్వానీ ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నెల క్రితం ఆయన అపోల్లో హాస్పిటల్తో పాటు ఆల్ ఇండియా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందిన విషయం తెలిసిందే.