06-08-2024 03:45:44 PM
హైదరాబాద్: రాష్ట్రం ప్రభుత్వం రైతు పంటల రుణమాఫీపై ఆరోపణలు, అనుమానాలు సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రుణమాఫీపై రాజకీయ విమర్శలు దురదృష్టకరమని, ఎన్ని ప్రయత్నాలు చేసిన రైతుల ద్వారా రాజకీయ లబ్ధి పొందలేరని మంత్రి తుమ్మల ప్రతిపక్షలను హెచ్చరించారు. సాంకేతిక ఇబ్బందులతో 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని, పొరపాట్లు అన్ని సరిచేసి అర్హులకు రుణమాఫీ చేస్తామన్నారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని, ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన వెల్లడించారు. మూడో విడత రుణమాఫీని వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు