calender_icon.png 28 July, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువుల పాకలో చిరుత... మూడు పిల్లలకు జననం

06-08-2024 03:09:39 PM

బల్లార్షా: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చి  మూడు పిల్లలకు జన్మనివ్వడం పలువురు జంతు ప్రేమికులను అబ్బుర పరిచింది. వారంరోజులుగా ఈ చిరుత నాగభీడ్ తాలూకాలోని బాలాపూర్ (ఖుర్దా) ప్రాంతాలలో సంచరిస్తూ ఆరుగురు వ్యక్తులపై దాడి చేయగా ఒకరు చనిపోయారు. పలు జంతువులపైనా దాడి చేసినట్లు సమాచారం. బాలాపూర్ పొలిమేరలో రైతు డిమ్ దేవ్ పశువుల పాకలో మూడు చిరుతకూనలు కనిపించటంతో అటవీ శాఖాధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.