28-07-2025 05:02:05 PM
వలిగొండ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా(District Chief Secretary Chanda Mahender Gupta) అన్నారు. సోమవారం వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో బీజేపీ మండల అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని ఎంపిటిసిలు, జెడ్పిటిసి ఎన్నికలకు అభ్యర్థులను నిలబెట్టి, వారి గెలుపుకు ప్రతి కార్యకర్త కంకణ బద్ధులై కష్టపడి పని చేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కార్యకర్త బంధువులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి, జిల్లా నాయకులు బందారపు లింగస్వామి, రాచకొండ కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి లోడే లింగస్వామి గౌడ్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.