18-11-2025 08:29:18 PM
రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత
అచ్చంపేట: ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తానని రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత పేర్కొన్నారు. మంగళవారం అచ్చంపేట మండలం పల్కపల్లి శివాలయం ప్రాంగణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ .. ఆర్యవైశ్యులలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని కార్పొరేషన్ ద్వారా వారికి సహకారం అందజేస్తామని అన్నారు.
ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, అనురాధ, అచ్చంపేట నియోజకవర్గంలోని వైశ్యులకు కమ్యూనిటీ భవనాలు, మద్ది మడుగులో సత్రం నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని కేటాయించడం అభినందనీయమని కొనియాడారు. మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు లక్ష్మీనారాయణ కార్యవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రత్యేక పూజలు, సామూహిక వనభోజనాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహాసభ విద్యా కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్, నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, విసనకరల చంద్రకుమార్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకులు మహిళలు పాల్గొన్నారు.