09-05-2025 12:45:23 AM
మహిళా సంఘాలు రుణాలు చెల్లించకపోతే మాది బాధ్యత
సెర్ప్ వార్షిక యాక్షన్‌ప్లాన్ ఆవిష్కరణలో మంత్రి సీతక్క
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): మహిళలకు బ్యాంకులు ఇచ్చే రుణం పేదరికంపై రణంలాగా పనిచేస్తుందని పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సమాజంలోని పేదరిక నిర్మూలనలో బ్యాంకర్ల పాత్ర కీలకమ న్నారు. గురువారం ప్రజాభవన్‌లో సెర్ప్ వార్షిక యాక్షన్‌ప్లాన్ 2025 మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కార్యక్రమానికి బ్యాం కర్లు, పీఆర్‌ఆర్‌డీ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి, జిల్లా మహిళా సమా ఖ్య ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గతేడాది మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణసదుపాయం కల్పించామని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే అదనం గా గతేడాది రూ.5వేలకోట్ల రుణాలను ఇప్పించామని తెలిపారు. యాక్షన్‌ప్లాన్‌కు అనుగుణంగా మహిళా సంఘాలకు రుణసదుపాయం కల్పించేందుకు బ్యాంకర్ల సహ కారం ఉండాలని సూచించారు.
రుణాలను తిరిగి చెల్లించడంలో మహిళా స్వయం సహాయక బృందాలు నిబద్ధతను చాటుకుంటు న్నాయని, 98.5 శాతం లోన్లను తిరిగి చెల్లించి(రీపే) చేసి రికార్డు సృష్టించాయని కొని యాడారు. మహిళా సంఘాల తరఫున తాము బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తున్నామని, మహిళా సంఘాలు తీసుకునే ప్రతీపైసాను చెల్లిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి చెంది న దేశాల్లో జీడీపీలో మహిళల భాగస్వా మ్యం 40% ఉంటుందని, భారతదేశం జీడీపీలో మహిళల భాగస్వామ్యం 18 శాతానికి పరిమితమైందన్నారు.
తాను విప్లవ సంఘం లో పనిచేసినప్పుడు తమ మొదటి పోరాటం వడ్డీ వ్యాపారుల మీదే చేశామని గుర్తుచేశా రు. తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక ఎస్టీ లు భూములు రాసి ఇచ్చేవారని తెలిపారు. బ్యాంకు లోన్లకు దూరంగా ఉన్న వర్గాలను గుర్తించి లోన్లు ఇప్పించేలా గ్రామీణాభివృద్ధి అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. వార్షిక ప్రణాళిక నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.