8 May, 2026 | 1:07 AM

నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే పాయం

08-05-2026 12:00 AM

కాలు నరాల వ్యాధి చికిత్సకు రూ.2.40 లక్షల ఎల్‌ఓసీ అందజేత

అశ్వాపురం, మే 7 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి వైద్య సహాయం అందించి ఆదుకున్నారు. గ్రామానికి చెందిన అమరనేని సీతారామయ్య కుమారుడు కాలు నరాల సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వైద్యానికి భారీ ఖర్చు అవుతుందని వైద్యులు సూచించడంతో, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం సహాయం కోసం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆశ్రయించింది. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, రూ.2 లక్షల 40 వేల విలువైన ఎల్‌ఓసీని గురువారం మణుగూరులో సీతారామయ్యకు అందజేశారు. ఈ సహాయంతో తమ కుమారుడి చికిత్సకు ఊరట లభించిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తక్షణ స్పందనతో సహాయం చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చెంచల రాము పాల్గొన్నారు.