3 July, 2026 | 11:56 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి

05-06-2025 12:14 AM

ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీ రిజర్వేష న్లను 42శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశం లో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లను పెంచకపోతే మాత్రం బీసీలు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పి లుపునిచ్చారు.

రిజర్వేషన్లను పెం చాలని డిమాండ్ చేస్తూ 14 సంఘా ల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు. దా దాపు ఏడాది నుంచి స్థానిక సంస్థల ఎన్నికలను బీసీ రిజర్వేషన్ల పేరిట వాయిదా వేస్తూ వచ్చిన సర్కారు... రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికల కు పోతామంటే అంగీకరించబోమ ని స్పష్టం చేశారు.

అసెంబ్లీలో 42శా తం రిజర్వేషన్ల చట్టం చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి జీవో జారీ కాలేదన్నారు. చట్టం చేసిన తర్వాత కేంద్రానికి పంపిస్తామని చెప్పినా ఇంతవరకు అతీగతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెం పు అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేం ద్రంపై నెట్టేసి తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నారని విమర్శించారు.