calender_icon.png 24 June, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్తాపూర్‌లో స్వాన్క్రెస్ట్ ప్రీ స్కూల్

05-06-2025 12:14:45 AM

- ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): అత్తాపూర్‌లోని నలందానగర్‌లో  స్వాన్క్రెస్ట్ ప్రీ స్కూల్‌ను బుధవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా నాణ్యత గల ప్రా థమిక విద్యను అందించడానికి ఈ తరహా విద్యాసంస్థలు అవసరమని అన్నారు.

స్కూ ల్ డైరెక్టర్లు శ్వేతా, రవిలను అభినందించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తాను అన్ని విధాలుగా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్‌గా గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ టీ మల్లేశ్‌ముదిరాజ్ హాజరై స్కూల్ నిర్వహణను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీకి చెందిన ఎం భాస్కర్‌గౌడ్, ఎం రవీందర్‌గౌడ్, నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్ గోపాల్, కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.