17-08-2025 04:11:32 PM
రేగొండ (విజయక్రాంతి): మండలంలోని లింగాల క్రాస్ వద్ద ఉన్న భారతి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 1998-99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. మండలంలోని కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా 26 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారి అపురూప క్షణాలను సెల్ ఫోన్ లో బంధించుకున్నారు. అనంతరం నాడు వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు శాలువాలతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు కృష్ణ ప్రసాద్, మల్లికార్జున్ రావు, నాగేశ్వరరావు, ప్రసన్నత రావు, రత్నకుమార్, శంకర్ రావు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.