17-08-2025 04:06:08 PM
హైదరాబాద్: నిర్మాణరంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, వినియోగదారుల ప్రయోజనాల మేరకు నిర్మాణరంగ సంస్థలు పనిచేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. ఆదివారం క్రెడయ్ ప్రాపర్టీ షో(CREDAI Hyderabad Property Show) కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మన్నిక గల ఇల్లు నిర్మించాలని, రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నెంబర్ వన్ అని అన్నారు. వరంగల్ లో విమానాశ్రయం రాబోతుందని, ఆదిలాబాద్ లోని డిఫెన్స్ ఎయిర్ పోర్టును ప్రజా విమానాశ్రయంగా మారుస్తామని తెలిపారు.
సాంకేతిక కారణాలతో మెట్రో పెండింగ్ లో ఉందని, త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఎంఎంటీఎస్ రైళ్లను ఏసీలుగా మారుస్తామని, సికింద్రాబాద్ లో రూ. 720 కోట్లతో రైల్వే పనులు చేస్తున్నామన్నారు. హైదరాబాద్-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పూర్తి చేస్తామని.. ప్రపంచంలో వస్తున్న మార్పుల దృష్ట్యా స్వదేశీ వస్తువులనే వాడదామని అన్నారు. బిల్డర్స్ అందరూ కూడా స్వదేశీ వస్తువులు వాడాలని కిషన్ రెడ్డి సూచించారు.