calender_icon.png 17 August, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి

17-08-2025 04:09:13 PM

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బిజెపి, ఆర్ఎస్ఎస్..

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

చండూరు/గట్టుప్పల (విజయక్రాంతి): దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ సోషలిజం సెక్యులరిజం స్ఫూర్తితో వచ్చిన భారత రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తీసుకురావాలని కుట్ర చేస్తుందని ఇది దేశ ప్రజలకు నష్టమని ప్రజలను విచ్చిన్నం చేసే మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు కార్యకర్తలు పోరాడాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం(CPM Party District Secretary Group Member Banda Srisailam) పిలుపునిచ్చారు. ఆదివారం గట్టుప్పల మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు చాపల మారయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన అన్నారు.

గట్టుప్పల మండల పరిధిలోని అంతంపేట, నామాపురం, శివన్న గూడెం రోడ్లు అధ్వానంగా తయారయ్యావని ఆయన అన్నారు. గత ఎన్నికల ముందు లింకు రోడ్లను బీటి రోడ్లుగా మారుస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చడం లేదని ఆయన అన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని ఆయన అన్నారు. దేశంలో కార్పొరేట్ శక్తులతో స్నేహం చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనార్టీ వర్గాల మీద ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా దాడి చేస్తుందని తన దోపిడీ  ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం మతాన్ని రాజకీయ కోసం వాడుకొని ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తుందని ఆరోపించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ఎలక్షన్, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే భాష పేరుతో భారత ప్రజలపై ఆర్ఎస్ఎస్ తమ సిద్ధాంతాన్ని రుద్దడం ద్వారా ఈ దేశాన్ని మత రాజ్యాంగ చేయాలని కలలుగంటుందని అన్నారు.

భారతదేశ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వాన్ని కోరుకుంటారని లౌకికవాదానికి కేంద్రంగా ఇండియా ఉంది అని బిజెపి మతోన్మాద చర్యల్లో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేకమంది సిపిఎం కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని సమ సమాజం స్థాపన కోసం పార్టీ పనిచేస్తుందని అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, సిపిఎం పార్టీ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, అచ్చిన శ్రీనివాస్ , సిపిఎం నాయకులు కర్నాటి వెంకటేశం, పెద్దగాని నరసింహ, ఖమ్మం రాములమ్మ, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.