14న లోక్ అదాలత్
10-06-2025 12:36 AM
హయత్ నగర్ కోర్టులో సమన్వయ సమావేశం
ఎల్బీనగర్, జూన్ 9 : ఈ నెల 14న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు, కక్షిదారులు రాజీ మార్గమే రాజమార్గంగా భావించి కేసులను పరిష్కరించుకోవాలని హయత్ నగర్ కోర్టు న్యాయమూర్తి సల్మా ఫాతిమా సూచించారు. హయత్ నగర్ 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. జడ్జి సల్మా ఫాతిమా మాట్లాడుతూ...
14న జాతీయ లో క్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు, కేసుల పరిష్కారంపై కక్ష దారులకు అవగాహన కల్పించాల న్నారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ సీఐలు నాగరాజు గౌడ్, మహేశ్ గౌడ్, అంజిరెడ్డి, వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్, ఏపీపీ లావ ణ్య కుమార్, సీనియర్ సూపరింటెండెంట్‌పాల్గొన్నారు.






