18 April, 2026 | 3:14 AM

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పని చేయాలి

10-06-2025 12:35 AM

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

నల్లగొండ టౌన్, జూన్ 9: బాధితులకు తత్వర న్యాయం జరిగేలా  పోలీసులు పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ప్రజల సౌకర్యార్థం  నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా  మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికా రులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కటినంగా వ్యవహరించాలని అన్నారు.