calender_icon.png 1 December, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభలో గందరగోళం.. ఆందోళన మధ్యే బిల్లులు

01-12-2025 12:29:34 PM

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(Parliament Winter Session) కొనసాగుతున్నాయి. లోక్‌సభలో విపక్ష పార్టీల సభ్యులు నినాదాలు చేస్తున్నారు. విపక్ష సభ్యులు ఎస్ఐఆర్, కార్మిక చట్టాల్లో మార్పులు, అదానీకి ఎల్ఐసీ నుంచి నిధుల బదిలీ, అమెరికా టారిఫ్ లు, ఎర్రకోట వద్ద పేలుళ్లపై చర్చకు పట్టుబడుతున్నారు. విపక్షాల ఆందోళన మధ్యే మంత్రులు బిల్లులు ప్రవేశ పెట్టారు. విపక్ష సభ్యుల ఆందోళనతో సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా(Lok Sabha Adjourned) వేశారు. ఉదయం ప్రారంభమైన సభను స్పీకర్ మొదట 12 వరకు వాయిదా వేశారు.