10-12-2024 01:07:25 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. మంగళవారం లోక్ సభ, రాజ్యసభలో అదానీ, సోరోస్ అంశాలపై చర్యకు విపక్షాలు పట్టుబట్టాయి. విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఉభయసభల కార్యక్రమాలకు తీవ్రం అంతరాయం కలిగింది. లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ సముదాయించిన విపక్ష ఎంపీలు వినకపోవడంతో విపక్ష నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన రాజ్యసభ ఛైర్మన్ విపక్ష సభ్యుల తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు.
పార్లమెంటులో విపక్షాల నిరసనలపై అసహనం వ్యక్తం చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా విపక్షాలు సభలో హుందాగా ప్రవర్తించాలని సూచించారు. పార్లమెంటు ప్రాంగణంలో కొన్ని రోజులుగా నిరసనలు చేస్తూ పోస్టర్లు, మాస్కులు ధరించి నినాదాలు చేస్తున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల తీరు సరిగా లేదని లోక్ సభ స్పీర్ మండిపడ్డారు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తూ స్వీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ప్రకటించారు.