calender_icon.png 14 August, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీ ఏమైంది?: కవిత

10-12-2024 12:26:43 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం, పంచామృత అభిషేకం బీఆర్ఎస నాయకులు చేశారు. అనంతరం నిరసన దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేసినట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. వేలాది ఉద్యమకారులు నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించట్లేదు..?, బతుకమ్మ పండుగను విగ్రహంలో ఎందుకు చేర్చలేదు..? అని ప్రశ్నించారు.

తొమ్మిది మంది కళాకారులను సన్నానిస్తామన్నారు కాదా, కళాకారుల జాబితాలో మహిళలు ఎక్కడ..?, విమలక్క, మల్లు స్వరాజ్యం, సంధ్య వంటి వారు కనిపించట్లేదా..? అని అడిగారు. తెలంగాణ పేద ప్రజలు ఎప్పటికీ అలాగే ఉండాలా..? మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీ ఏమైందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం స్ఫూర్తి నింపేది కాదని, సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తరస్కరిస్తున్నామన్నారు.  ఉద్యమ కాలం నాటీ ప్రతీకలను అవమానించే యత్నం చేశారని, ఉద్యమకారులకు సాయం చేయాలే కానీ అవమానించవద్దని కవిత మండిపడ్డారు.