03-08-2025 12:28:19 AM
నాగర్‌కర్నూల్/వనపర్తి, ఆగస్టు 2 (విజయక్రాంతి): కృష్ణా నది ఒడ్డున ఏపీ నిర్మి స్తున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఇరువురూ చేసుకున్న చీకటి ఒప్పందం బయటపెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. నారా లోకేష్‌ను కేటీఆర్ ఎందుకు కలుసుకున్నారో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీయడంతోనే బనకచర్ల ముసుగే సుకుని రెండు పార్టీలు కపట నాటకం ఆడుతున్నాయని ధ్వజమెత్తారు.
నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ వాదం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం పదేళ్లు తన పాలనలో కృష్ణ, గోదావరి హరివాహకంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి అమ్ముకున్నారని ఆరోపించారు.
శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్ట ణంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామా ల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు. నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పట్టాలు పంపిణీ చేశారు. 7 విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండ లం వెలటూరు గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పదేళ్లపాటు అధి కారంలో ఉన్న కేసీఆర్ కేవలం ప్రాజెక్టులు డిజైన్ల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేయ డం మినహా కనీసం పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదన్నారు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే పూర్తిచేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోవడం వల్లే ప్రస్తుతం కృష్ణానది నీటిని తోడిపోసుకునే అవకాశం లేకపోయిందన్నారు.
గోదావరి నది నీటిని కూడా తెలంగాణ ప్రాంతం పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోయిందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజె క్టు స్థానంలో కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మిం చి 38 వేల కోట్ల నుండి 1,28 వేల కోట్లు అంచనాలు పెంచి ఆర్భాటంగా నిర్మించారని చివరగా అది కూలేశ్వరంగా కృంగిపోయిందన్నారు.
రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లడం వల్లే ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేశారని లేదంటే తెలంగాణ ప్రాంతానికి తీరని న ష్టం వాటిల్లేదన్నారు. తెలంగాణ నీళ్లు ఆం ధ్రకు వెళ్తున్నాయంటూ తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
గత పదేళ్ల కాలంలో కృష్ణ పరివాహక ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజె క్టు పూర్తి చేసి ఉంటే కృష్ణ నీటి వాటా పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉండేదన్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ర్టం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తు పెంచితే పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ అధికారం లోకి వచ్చాక బిజెపితో కుమ్మక్కు పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ఆర్డినెన్స్ తీసుకువచ్చారని ప్రస్తుతం అది ఆపకపోతే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. తెలంగాణ రాష్ర్టంలో కృష్ణ, గోదావరి పరివాహకంలో ప్రాజెక్టులు పూర్తి అయ్యేదాకా మా నీళ్లు మా వాటా అందేదాకా ఆంధ్ర రాష్ర్టంలోని ఏ ప్రాజెక్టులు నిర్మించడానికి వీలు లేదని హెచ్చరించారు.
వరద జలాలే కదా వాడుకుంటామంటూ బనకచర్ల నిర్మించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాగా తన సోదరుడు స్వర్గీయ మల్లు అనంత రాములు 1980లో నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో తాను విద్యార్థిగా ఉన్నానని, ఆ సమయంలో తనను కొల్లాపూర్ ఇన్చార్జిగా నియమించారని ఆనాడే తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారని భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం పోతిరెడ్డిపాడు కాల్వ ద్వారా కృష్ణా జలాలను ఇప్పటికే భారీగా తరలించుకుపోతున్నదని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణతో మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరగనుందని, శ్రీశైలం రిజర్వాయర్ లోని నీళ్లు రెండు మూడు నెలల్లోనూ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంత నీటీ సమస్య తీరాలంటే; వెల్టూరు, చిన్నమర్రి మధ్య కృష్ణ నదిపై డ్యాం నిర్మించాల్సిన అవసరం ఉందని, ఒక్క ఎకరం ముంపు ముప్పు లేకుండా సుమారు 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ ఫరూఖీ, ట్రాన్స్‌కో, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు తూడి మెగారెడ్డి, డాక్టర్ రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.