03-08-2025 12:59:36 PM
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు విమర్శ..
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, విద్యార్థులను నిలువునా మోసం చేసి మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ లకు తెరలేపి, జనహిత పాదయాత్ర పేరున ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనిని ప్రజలు తిప్పికొట్టాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు(ABVP State Secretary Macherla Rambabu) దుయ్యబట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఆదివారం, సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ,పిసిసి చీఫ్ ముఖేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జనహిత పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో దాని ఉద్దేశించి ఖానాపూర్లో ఏబీవీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ,ఆరు గ్యారంటీలు, ఇచ్చి ప్రజలను మోసం చేసింది దాంతోపాటు విద్యార్థులకు ప్రతి ఏడు రెండు లక్షల ఉద్యోగుల కల్పన చేస్తామని చెప్పి మోసం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇప్పటికి గురుకులాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 125 మంది విద్యార్థులు, నిరుద్యోగులు 60 మంది దాంట్లో బీసీ నిరుద్యోగులు పదుల సంఖ్యలో మరణించారని ఇచ్చిన ఈ హామీలన్నీ తుంగలో తొక్కి మరో సారీ బీసీలను మోసం చేసేందుకు బీసీ రిజర్వేషన్ అంటూ ప్రజల్లోకి వస్తున్నారని ,ఈ మోసాలన్నీ స్థానిక ఎన్నికల జిమ్మిక్కులని దాని గ్రహించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశి, నిర్మల్ జిల్లా విభాగ్ కన్వీనర్ దినేష్, ఎస్ ఎఫ్ డి జిల్లా కన్వీనర్ దుర్గాప్రసాద్ ,రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయికుమార్ ,శశాంక్, దశరథ్ ,మహేందర్ ,తదితరులు ఉన్నారు.