03-08-2025 12:27:03 AM
- వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు
- అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు
- నాసిరకమైన బియ్యమే దిక్కు
- ఉడికీ ఉడకని అన్నమే వడ్డింపు
- వారం రోజులకు సరిపడా కూరగాయలు ఒకేసారి సరఫరా
- పాలు, గుడ్లు, చికెన్, మటన్ సరఫరాలోనూ అలసత్వం
- చాలీ చాలని భోజనంతో పస్తులుంటున్న స్టూడెంట్స్
- అయినా తేరుకొని అధికార యంత్రాంగం
నాగర్‌కర్నూల్, ఆగస్టు 2 (విజయక్రాంతి): గురుకులాలపై ప్రభుత్వానికి, అధికార యంత్రానికి దయ లేనట్టుగా అనిపిస్తున్నది. దానికి వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి విద్యార్థులు అస్వస్థకు గురవడమే నిదర్శనం. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లాలో ని మన్ననూరు ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల, అచ్చంపేట ఎస్సీ బాలుర గురుకు ల పాఠశాల, కల్వకుర్తి ఎస్టీ బాలుర వసతిగృహం, కల్వకుర్తి బాలికల బీసీ గురుకుల పాఠశాలలను ‘విజయక్రాంతి’ బృందం సం దర్శించింది.ఈ క్రమంలో విద్యార్థుల ఇబ్బందులు, సమస్యలు గుర్తించింది.
గురుకుల పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ పాఠశాలలు, హాస్టల్లోనూ సరైన భోజనం అంద డం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల్లో నాసిరకమైన బియ్యమే దిక్కుగా మారింది. ఉడికీ ఉడకని అన్న మే వడ్డిస్తున్నారు. వారం రోజులకు సరిపడా కూరగాయలు ఒకేసారి సరఫరా చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు. పాలు, గుడ్లు, చికెన్, మటన్ సరఫరాలోనూ టెండర్‌దారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. చాలీ చాలని భోజనంతో స్టూడెంట్స్ పస్తులుంటున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం మెరుగైన భోజనం అందించేందుకు కాస్మోటిక్ చార్జీలను సైతం పెంచి నా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో అందడం లేదు. కాగా కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న కొంతమంది వంట ఏజెన్సీలకు నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 111 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం కల కలం రేపింది. కాలం చెల్లిన పాలతో తోడు వేసిన పెరుగ న్నం విషంగా మారి విద్యార్థులు తిన్న కొద్దిసేపటికే తీవ్ర కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిపాలయ్యారు. దీం తో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.
కాంగ్రెస్ ప్రభు త్వం విద్యార్థుల పట్ల చూపుతున్న అశ్రద్ధను ఎత్తిచూపుతూ తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశాయి. ఏరోజుకారోజే పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు సరఫరా చేయాల్సి ఉన్న వారానికి సరిపడా ఒకేసారి సరఫరా చేస్తున్నారు. వాటితో చేసిన భోజనం ఫుడ్‌పాయిజన్‌కు కారణమవుతోంది. ఆయా గురు కులాలకు సరఫరా చేసే బియ్యం నాసిరకమైనవిగా ఉండటం ప్రధాన సమస్యగా మారిందని ఆయా గురుకులాల ప్రిన్సిపాల్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు నాసిరకమైన బియ్యాన్ని రిటర్న్ పంపినప్పటికీ మళ్లీ అవే అవే బియ్యం సరఫరా చేస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో మాత్రమే విద్యార్థులకు వండి పెడుతున్నట్లు తెలుస్తున్నది.
భోజనం వండే క్రమంలోనూ తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఉడికీ ఉడకని ముద్దలాగా అన్నం మారుతోందని విద్యార్థులు కూడా సరిగ్గా తినడం లేదని కొన్ని గురుకుల ప్రిన్సిపాల్‌లు పేర్కొంటున్నారు. దూరభారం కారణంగా టెండర్ దక్కించుకున్న కూరగాయల టెండర్‌దారులు వారానికి సరిపడా ఒకేసారి పంపుతున్నారని చెపుతున్నారు. ఏరోజుకారోజే తేవాలని పలుమార్లు చెప్పినా వినడం లేదని చెపుతున్నారు. మరికొన్ని గురుకులాలు, హాస్టళ్లలో నీటి సమస్య ఉందని, మిషన్ భగీరథ నీరు కలుషితమై సరఫరా అవుతోందని పేర్కొంటున్నారు. గురుకులాల్లో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్తున్న మీడియాకు ఆంక్షలు విధిస్తుండటం తో చాలా సమస్యలు వెలుగులోకి రాని పరిస్థితి ఏర్పడింది.
నాసిరకమైన బియ్యంతోనే ఇబ్బందులు
జిల్లాలోని ఎస్సీ గురుకులాలకు సరఫరా చేస్తున్న బియ్యం నాసిరకంగా సర ఫరా అవుతున్నాయని పలుమార్లు ఆయా గురుకులాల ప్రిన్సిపాళ్ల ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు రైస్ తిప్పి పంపుతు న్నాం అయినా అలాగే వస్తున్నాయి. కూరగాయలు సరఫరా చేసే టెండర్ దారులకు కూడా కనీసం రోజు విడిచి రోజు తాజా కూరగాయలను వేయాలని ఒత్తిడి తెస్తున్నాం. విద్యార్థులకు మెనూ ప్రకారమే భోజనం అందిస్తున్నాం.
అంబయ్య, ఎస్సీ గురుకులాల రీజనల్ కో ఆర్డినేటర్, నాగర్‌కర్నూల్