బైక్‌ను ఢీకొన్న లారీ
16-08-2026 12:00 AM
కూతురు మృతి.. తల్లిదండ్రులకు తీవ్రగాయాలు
ఘట్‌కేసర్, ఆగస్టు 15 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెంద గా తల్లిదండ్రులకు తీవ్ర గాయాలైన ఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గు బా సురేష్ (38), అతని భార్య గుబా ఉమారాణి (33), కుమార్తె గుబా శ్రావణి (17)తో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఘట్కేసర్ వందన హోటల్, హెచ్‌పి పెట్రోల్ బంక్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శ్రావణి తలకు తీవ్ర రక్తస్రావ మై అక్కడికక్కడే మృతి చెందిం ది. ఉమారా ణి, సురేష్ చేతులు, కాళ్లకు తీవ్ర గాయాల య్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించి, గా యపడిన వారికి చికిత్సలు అందిస్తున్నారు.






