ఫామ్‌హౌస్‌లో గంజాయి సాగు
16-08-2026 12:00 AM
ఒకరి అరెస్టు
మొయినాబాద్, ఆగస్టు 15(విజయ క్రాంతి): యెంకేపల్లి హృదయ ఫామ్హౌస్లో అక్రమంగా గంజాయి మొక్కను సాగు చేస్తున్న వ్యక్తిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా గార్డెన్లో ఇతర మొక్కల మధ్య దాచిపెట్టి పెంచుతున్న 15 అడుగుల గంజాయి మొక్కను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మొక్క బరువు సుమారు 11.44 కిలోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఫామ్హౌస్ వాచ్మెన్/గార్డెనర్ బ్యానే కామి అలియాస్ బహదూర్ అలియాస్ మోహన్సింగ్ జైగాడి (47)గా గుర్తించారు. ఎనిమిది నెలలుగా రహస్యంగా సాగు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. NౄPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






