01-06-2025 12:00:00 AM
రోజువారీ డైట్ ఉదయం టిఫిన్: ఒక రోటీతో ఐదు గుడ్లలోని తెల్లసొన ఆమ్లె ట్ వేసుకొని తినేది. దాంతో పాటుగా ఒక గిన్నెలో పోహా, రెండు పనీర్ ముక్కలు, పండ్లముక్కలతో కూడిన అధిక ప్రో టీన్ ఉన్న పెరుగు ఒక కప్పు.
మధ్యాహ్నం: పుచ్చకాయ, స్ట్రాబెర్రీలు, బ్లాక్ కాఫీ, కొబ్బరి నీళ్లు.
భోజనం: 100 గ్రాముల చికెన్ తో పాటు ఆకుకూరలు, పెరు గు అన్నం, పనీర్ భుర్జీ.
సాయంత్రం: గ్రీన్ టీ
రాత్రి భోజనం: పచ్చి కూరగాయలతో వేయించిన పనీర్ సలా డ్, 100 గ్రాముల చికెన్ బుర్జీ
హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ వల్లనో.. జీన్స్ వల్లనో లేదా అతిగా తినడం వల్లనో బరువు పెరుగుతారు చాలామంది. బరువు తగ్గే ప్రయత్నాలు చాలానే చేస్తున్నా మధ్యలోనే వాటికి చెక్ పెట్టేస్తుంటారు. లోపల బలంగా ఉంటే బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా తగ్గుతారు. కాకపోతే కాస్త నోరు కట్టడి చేసుకో వాలి. బయటి ఫుడ్ జోలికి అసలు వెళ్లకూడదు. అదే చేసింది కోపాల్ అగర్వాల్.
ఇంతకు ముందు తన బాడీ తనకే బరువుగా ఉండేదని. ఇప్పుడు తన షేప్‌ని తానెంతో ఇష్టపడుతున్నానని ఇన్‌స్టాలో షేర్ చేసింది అగర్వాల్. అన్నట్టు డైట్ ప్లాన్ కూడా షేర్ చేసింది ఇన్ స్టాలో అదేంటో చూద్దాం.
ఇరవై నాలుగేళ్ల కోపాల్ అగర్వాల్ తన బరువు తగ్గించే ప్రయాణం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించింది. ఆమె బరువు 101 కిలోల నుంచి 61 కిలోలలకు తగ్గించుకుంది. ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం యూకేలో చదువుతున్న కోపాల్..
తన వీడియోలో ఒకదానిలో చూసినట్లుగా, తనకు మోడ్రన్ దుస్తులను ధరించడం చాలా ఇష్టమని చెబుతుంది. గతంలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం వల్ల సాధారణ దుస్తులను మాత్రమే ధరించానని ఆమె పంచుకుంది. బరువు తగ్గడం వల్ల తన శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా తన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిందని.. దాంతో తన ఆత్మగౌరవం కూడా మెరుగుపడిందని ఆమె చెప్పింది.
కోపాల్ ఈ నాలుగు ఆరోగ్యకరమై న అలవాట్లను పాటించడం ద్వారా కేవ లం ఆరు నెలల్లోనే 32 కిలోల బరువు తగ్గారని చెప్పింది. గోరువెచ్చటి నీటితో రోజును ప్రారంభించాలి. చురుకైన జీవనశైలిని కలిగి ఉండాలి. రోజుకు కనీసం పదివేల అడుగులు నడవాలంది.