01-06-2025 12:00:00 AM
డబ్బును చులకనగా చూడకూడదు. డబ్బు మనిషి ఆకలి తీరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని నూరి పోస్తుంది. అత్యవసరమై నప్పుడు పోయే ప్రాణాన్ని కాపాడుతుంది కూడా. అందుకే డబ్బు పట్ల ఎవరి ఫిలాసఫీ వారికి ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. అయితే డబ్బు చుట్టూ తిరిగే ఏ మాట అయినా విలువైనదే!. బాలీవుడ్ భామలు వివిధ సందర్భాల్లో ఏమన్నారో చూద్దాం..
ఆర్థిక స్వేచ్ఛ అవసరం
మనకు మనం నచ్చినట్లు బతకాలంటే ఆర్థికంగా ఇతరులపైనా ఆధారపడకూడదు. ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడినప్పుడు అనుభవించే ఆర్థిక స్వేచ్ఛ అన్నిటికంటే విలువైనది. చిన్నప్పుడు రకరకాల పద్ధతుల్లో ఆ పాఠాన్ని అమ్మ నేర్పిస్తూ వచ్చింది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆర్థిక స్వేచ్ఛ అర్థమవుతూ వచ్చింది. అందుకే నేను ఇతరుల మీద ఆధారపడను. ఖర్చు పెట్టేప్పుడు ముందుచూపుతో వ్యవహరిస్తాను.
ప్రియాంక చోప్రా అసలైన ఆదాయం అదే!
వచ్చిన సంపాదనలో ముందు కొంత పొదుపు చేశాక మిగిలిందే అసలైన ఆదాయం అన్నది నాకు నేను తీర్మానించుకున్న ఆర్థిక సూత్రం. ఇక ఏ ఖర్చులైనా అందులోనే.. ఏ ఆలోచనలైనా ఆ పరిధిలోనే.. అంతేకానీ డబ్బు చాలడం లేదన్న సాకుతో దాచుకున్న సొమ్మును ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టను. ఆర్థిక నిగ్రహం మనకు మనం సాధన చేస్తే అబ్బే అలవాటు. ఎక్కడో చదివితేనో.. ఎవరో చెబితేనో రాదు.
దీపికా పదుకొనె ఎరుకతో వ్యవహరించాలి
వొళ్లు దగ్గర పెట్టుకొని ఖర్చు పెట్టాలి అని అంటుంటారు కదా మన పెద్దలు. నా దగ్గర ఎంత డబ్బులున్నా.. ఆ పెద్దల మాట నా వినియోగమనస్తత్వానికి స్వీడ్ బ్రేకర్‌లా పనిచేస్తుంటుంది. మనం ఖర్చు పెట్టే ప్రతిసారీ ఎరుకతో వ్యవహరించాలి. బాధ్యతతో మెలగాలి. అప్పుడే డబ్బు కూడా మన దగ్గర గౌరవంగా ఉంటుంది.
పరిణితీ చోప్రా తొలి సినిమాతో..
డబ్బును గౌరవించాలి అని నేను తెలుసుకున్నది ఎప్పుడంటే? నా తొలి సినిమాకు పారితోషికం తీసుకున్నప్పుడు. సినిమా నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? నాకు రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలి? సినిమాకు ఎంత మార్కెట్ ఉంటుంది? ఇన్ని తర్జన భర్జనలు జరిగాయంటే.. డబ్బుకు విలువ ఉన్నట్లే కదా!. అందుకే నేను తల్లిదండ్రులను, ఆత్మీయులను ఎంతగా గౌరవిస్తానో.. డబ్బును కూడా అంతే ప్రేమిస్తాను.
అలియాభట్