calender_icon.png 14 May, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ ఆర్ ఎస్ 25% రాయితీతో గడువు పెంపు

14-05-2025 12:47:01 AM

గద్వాల, మే 13 (విజయక్రాంతి) : ప్రజల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పె ట్టుకొని అక్రమ లేఅవుట్లను 25% రాయితీతో క్రమబద్ధీకరణ చేసుకునేందుకు గడువు ను *తెలంగాణ ప్రభుత్వం మే, 31వ తేదీ వర కు అవకాశం కల్పించిందని, ఇట్టి అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ గురువారం ఒక ప్ర కటనలో తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని జిల్లాలో ఇంకా LRS ఫీజు కట్టని 19,545 మంది సద్వినియోగం చేసుకోవాలని, LRS ఫీజు కట్టేందుకు మీ ప్లాట్ లకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా, ఆయా మునిసిపాలిటీలలో నేరుగా వెళ్లి సమస్య పరిష్కరించుకొనగలరని మరి యు గ్రామ పంచాయతి పరిధిలో ప్లాట్ల ఫీ జు చెల్లింపు చేయుటకు ఏదైనా సమస్యలు ఉన్నా.

ఆ గ్రామ పంచాయతి కార్యదర్శిని కా ని, జిల్లా పంచాయతి అధికారి కార్యాలయం లో కాని వెళ్లి సమస్య పరిష్కరించుకొనగలరని లేదా https://lrs.telangana. gov. in/layouts/Citizenlogin.aspx ద్వారా నేరుగా తమ దరఖాస్తులు పరిశీలించుకొని LRS ఫీజు చెల్లింపు చేయవచ్చని, ఫీజు కట్టిన వారికి L1, L2, L3 లాగిన్ లలో వెరిఫికేషన్ చేసి వెంటనే ప్రొసీడింగ్ కూడా జారి చేయ డం జరుగుతుందని ఇందుకు అందరూ దరఖాస్తు దారులు సహకరించాలని జిల్లా కలెక్ట ర్ తెలిపారు. కావున అందరు ప్లాట్ యజమానులు ఇట్టి అవకాశాన్ని వినియోగించు కొనుటకు తెలియజేయనైనది.