calender_icon.png 14 May, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోవాలి

14-05-2025 12:49:00 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, మే 13 ( విజయక్రాంతి ) : రైతులకు ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు ధా న్యాన్ని త్వరగా దించుకొని లారీలను త్వరగా పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం రాజనగరం వ రి కొనుగోలు కేంద్రాన్ని, చిట్యాల వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ రైస్ మిల్లును కలెక్టర్ సందర్శించారు.అకాల వర్షాలు పడు తుండటంతో రైతులు వరికొనుగోలు కేంద్రా ల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉందని, అందువల్ల మిల్లుకు వచ్చిన ధాన్యం లారీలను దించుకొని వెంటనే తిరిగి పంపాలని మిల్లర్లను సూచించారు.

సన్నరకంతో పాటు మరిత దొడ్డు రకం వడ్లు తీసుకోవాలని మిల్లరును సూచించారు. వెంకటేశ్వర మిల్లు లో ధాన్యం నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. రాజనగరం వరి కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన వడ్లను కలెక్టర్ పరిశీలించారు. తేమశాతం వచ్చిన వెంటనే వడ్లు తూకం వేసి మిల్లుకు పంపించాలని నిర్వాహకులను ఆదేశించారు. సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.