13-03-2025 12:52:43 AM
జనగామ, మార్చి 12(విజయక్రాంతి): అనధికార లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశా న్ని ప్రజలు వినియోగించుకుంటున్నారు. దీంతో జనగామ జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రి య ఊపందుకుంది. 2020లో స్వీకరించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను 2025 మార్చి 31లోగా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ రుసుములో 25 శాతం రాయితీ కల్పి స్తున్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. బుధవారం ఆయన జనగామ మునిసిపల్ కార్యాలయం, రఘునాథపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తోన్న ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియ ను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లించిన దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీ నిస్తూ, వెంటనే క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రొసీడింగ్‌లు జారీ చేస్తున్నట్లు తెలిపా రు. మిగిలిన దరఖాస్తుదారులు కూడా నిర్ణీత గడువు లోగా ఈ రాయితీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎల్‌ఆర్‌ఎస్ రుసుములు చెల్లించిన వారికి స్థల క్రమబద్ధీకరణ చేసి సంబంధిత ప్రొసీడింగ్‌లు జారీ చేస్తున్నామన్నారు. మరోవైపు పన్నుల వసూలుపై మునిసిపల్ అధికారులకు పలు సూచ నలు చేశారు.
ప్రతి రోజు రూ.8 లక్షల నుంచి రూ.పది లక్షల వరకు ఆస్తి పన్నులు వసూ లు చేయాలన్నారు. పన్ను ఎగవేతదారులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ 1864 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు మున్సిపల్ పరిధిలో 113 మందికి నోటీసు లు జారీ చేసినట్లు వెల్లడించారు.